శ్రీ సత్యనారాయణశర్మ గారు వేదాంత - యోగ - తంత్ర - జ్యోతిషశాస్త్రములలోను మరియు ప్రత్యామ్నాయ వైద్యవిధానములలోను లబ్దప్రతిష్ఠులు. భారతదేశము మరియు అమెరికా సంయుక్తరాష్ట్రములలో వీరిచే స్థాపించబడిన ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని వెలుగుదారులలో నడిపిస్తున్నది. 70 పైగా వీరు రచించిన గ్రంథములు ఆధ్యాత్మిక జ్ఞాననిధులుగా చదువరులచేత కొనియాడబడుచున్నవి. వీరు ప్రస్తుతము ఒంగోలు దగ్గరలోని ‘పంచవటి యోగాశ్రమము’లో నివసిస్తూ, జిజ్ఞాసువులకు, సాధకులకు మార్గదర్శనం గావిస్తున్నారు.